: ఘట్ కేసర్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో మంటలు...దొంగల పనేనా?
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని దెక్కన్ గ్రామీణ బ్యాంకులో మంగళవారం ఉదయం మంటలు రేగాయి. బ్యాంకు కొనసాగుతున్న భవనంలో నుంచి మంటలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో దోపిడీ జరిగి ఉంటుందని, దొంగలు వినియోగించిన గ్యాస్ కట్టర్ల వల్లనే మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత కాని అసలు విషయం బయటకు రాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.