: పేలిన గ్యాస్ సిలిండర్... ఇద్దరి మృతి, 13 మందికి తీవ్ర గాయాలు


ఓ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ, శిశువు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్ పరిధిలోని రంగ్రీజు వీధిలో ఈ ఘటన సంభవించింది. గాయపడిన వారిని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన చిన్నారి వయసు రెండు నెలలు మాత్రమే. పేలుడు సంభవించిన భవనానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఈ చిన్నారి ఉంటోంది. పేలుడు ధాటికి వచ్చిన భారీ శబ్దానికి ఈ చిన్నారి మరణించింది. ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది.

  • Loading...

More Telugu News