: ప్రియదర్శిని క్యాబ్స్ లో అంతా మహిళలే... అయినా సర్కారు అనుమతి రాలేదు!


దేశ రాజధాని ఢిల్లీలో ఉబెర్ క్యాబ్స్ డ్రైవర్, తన కారులో ఇంటికి బయలుదేరిన మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఐటీ సిటీ బెంగళూరు సహా, దేశంలో పలు నగరాల్లోనూ ఈ తరహా ఘటనలు కోకొల్లలు. అయితే "మొత్తం మహిళా డ్రైవర్లతోనే క్యాబ్ సేవలందిస్తాం... మహిళలను సురక్షిత ప్రయాణాన్ని అందజేస్తాం" అనుమతివ్వండన్న ప్రియదర్శిని ట్యాక్సీ సర్వీసెస్ కు మాత్రం సర్కారీ అనుమతి లభించలేదు. మహిళల భద్రతకు భరోసానిచ్చే ఈ కంపెనీకి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ కంపెనీ అనుమతి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయిందని కంపెనీ యజమాని సుస్జెబెన్ షా తెలిపారు. కొత్త సీఎం అయినా తమకు త్వరితగతిన అనుమతిస్తే, మహిళలను సురక్షితంగా ఇంటివద్ద దించుతామంటూ ఆమె చెబుతున్నారు. మరి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారైనా ప్రియదర్శని ట్యాక్సీ సర్వీసెస్ కు అనుమతిస్తుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News