: ముస్లింల మెప్పు పొందేందుకు నిజాం పేరు పెడతారా?: కేసీఆర్ పై పాల్వాయి ఫైర్


హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరు పెట్టాలన్న టీఆర్ఎస్ సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తన నిరసనను వ్యక్తం చేస్తూ టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. నిజాం బలగాలు, రజాకార్ల దాష్టీకాలకు తెలంగాణలో ఎన్నో కుటుంబాలు బలయ్యాయని, తమ కుటుంబంపై కూడా దాడి జరిగిందని లేఖలో తెలిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారని అన్నారు. కేబీఆర్ పార్కుకు నిజాం పేరును పెట్టాలన్న ఆలోచనను మరోసారి ఆలోచించాలని కోరారు. కేవలం, ముస్లింల మెప్పు పొందేందుకే నిజాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారని... ఇది సరికాదని లేఖలో స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News