: నేడు జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లలో మూడో విడత ఎన్నికలు... బరిలో ఒమర్ అబ్దుల్లా


జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా నేడు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లో 16, జార్ఖండ్ లో 17 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి, మాజీ స్పీకర్ సీపీ సింగ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాలు నేటి ఎన్నికల బరిలో ఉన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో, పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News