: వికెట్ల వేట ప్రారంభించిన ఆరోన్... రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రాక్టీస్ మ్యాచ్ లలో సత్తా చాటిన ఆరోన్ ఆసీస్ పర్యటనలో వికెట్ల వేటను ప్రారంభించాడు. ఆరోన్ విసిరిన బంతి వాట్సన్ బ్యాట్ ను తాకుతూ సెంకడ్ స్లిప్ లోకి దూసుకుపోయింది. ఏ మాత్రం పొరపాటు చేయని ధావన్ క్యాచ్ ను అందుకున్నాడు. దీంతో, 3 ఫోర్ల సహా 14 పరుగులు చేసిన వాట్సన్ పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు. వార్నర్ 64 పరుగులు, క్లార్క్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.