: నన్ను నమ్మండి... మళ్లీ ఆ పొరపాటు చేయను: కేజ్రీవాల్


చేజేతులా అధికారాన్ని పోగొట్టుకున్న ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్... ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడానికి నానా తంటాలు పడుతున్నారు. జాతీయ పార్టీలను కాదని ఆప్ కు అధికారాన్ని కట్టబెడితే... పాలనను మూన్నాళ్ల ముచ్చట చేశారంటూ ఢిల్లీ వాసులు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఓటర్లను ఆకట్టుకోవడానికి కేజ్రీవాల్ చేయని ప్రయత్నం అంటూ లేదు. నిన్న న్యూయార్క్ లో ఆప్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, నన్ను నమ్మండి... గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయనని కేజ్రీ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 49 రోజులకే రాజీనామా చేశానని... మరోసారి ఆ పొరపాటు చేయనని విన్నవించారు. ఆప్ నుంచి కొనసాగుతున్న వలసలను కొట్టి పారేసిన ఆయన... ప్రస్తుతం పార్టీ బలంగానే ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News