: తొలి టెస్టు ప్రారంభం... వార్నర్ హాఫ్ సెంచరీ


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్ట్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. అడిలైడ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ కు దిగింది. ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే రోజర్స్ వికెట్ ను కోల్పోయింది. కేవలం 9 పరుగులకే రోజర్స్, భారత పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే జూలు విదిల్చిన వార్నర్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని 55 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ 13 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి ఆసీస్ 85 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News