: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం... ఈ నెల 18న జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్
వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 18న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి ముహూర్తం నిర్ణయించింది. నిన్న సాయంత్రం జరిగిన రాకెట్ సన్నద్ధత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ బెంగళూరు నుంచి జీఎస్ఎల్వీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలే ఫ్రెంచ్ గయానా లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీని ప్రయోగించిన సంగతి తెలిసిందే.