: టైమ్స్ రీడర్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా మోదీ ఎంపిక!


భారత ప్రధాని నరేంద్ర మోదీ... టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు టైమ్ మేగజీన్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఏటా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిని ఎంపిక చేస్తున్న టైమ్ మేగజీన్, ఇందుకోసం సుదీర్ఘంగా ఆన్ లైన్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఈ పోలింగ్ ఆదివారం ముగియగా, ఫలితాలను సోమవారం ప్రకటించిన సదరు మేగజీన్, ప్రపంచ పాఠకుల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా మోదీని ప్రకటించింది. ఆన్ లైన్ లో పోలైన మొత్తం ఓట్లలో మోదీ ఒక్కరే 16 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. అయితే టైమ్ మేగజీన్ ప్రపంచ నేతల తుది జాబితాలో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. టైమ్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ తుది పోటీలో నిలిచిన ఎనిమిది మంది జాబితా నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో చైనా ఈ-టెయిలింగ్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, ఎబోలా వైద్యులు, రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫెర్గ్యూసర్ ఆందోళనకారులు, గాయకుడు టేలర్ స్విఫ్ట్, నేషనల్ ఫుట్ బాల్ లీగ్ కమిషనర్ రోజర్ స్టోకోయి గూడెల్, కుర్దూ రాజకీయవేత్త మసౌద్ బర్జానీలు ఉన్నారు. వీరి నుంచి మేగజీన్ 'పర్శన్ ఆఫ్ ద ఇయర్'ను ఎడిటర్ల బృందం ఎంపిక చేసి ఈ నెల 10న ప్రకటిస్తుంది.

  • Loading...

More Telugu News