: స్పైస్ జెట్ 1800 విమాన సర్వీసులు రద్దు చేసింది
స్పైస్ జెట్ విమాన సంస్థ ఈ నెలలో 1800 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సర్వీసుల్లో కొన్ని నేపాల్ కు వెళ్లాల్సినవి కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా స్పైస్ జెట్ 81 సర్వీసులను రద్దు చేసింది. కాగా, స్పైస్ జెట్ ఆఫర్లు, ఆ సంస్థ వ్యవహార శైలి తమకు ఆ సంస్థపై అపనమ్మకాన్ని పెంచుతున్నాయని శుక్రవారం డీజీసీఏ అనుమానం వ్యక్తం చేసింది. దానితోపాటు తక్షణం ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, వైమానిక సంస్థకు బాకీపడిన మొత్తాలు చెల్లించాలని, ప్రయాణికులు ముందుగా చెల్లించిన డబ్బులు వాపస్ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.