: పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే మాపై ఆరోపణలు: టీటీడీపీ అధ్యక్షుడు రమణ


పాలనాపరమైన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం టీడీపీపై ఆరోపణలు చేస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, అధికారం చేపట్టిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తమపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు 8 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు విస్మరించారని అన్నారు. పాలమూరు జిల్లాలో తక్కువ నిధులతో, తక్కువ సమయంలో బీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉండగా, అవి మానేసి కొత్త పథకాల పేర్లు చెప్పి, వాటిని టీడీపీ అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తోందని, దీని కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News