: ఎంతో కష్టపడ్డాను...అదంతా ప్రజల సమయమేనని భావించాను: బాబు


ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంతో కష్టపడ్డానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిద్రపోతున్న సమయం తప్ప మిగిలిన ప్రతి క్షణం ప్రజల కోసమే పని చేశానని అన్నారు. అయితే ఆ సమయమంతా ప్రజలదేనని తాను భావించానని ఆయన చెప్పారు. తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని సమస్యల వలయం నుంచి బయటపడెయ్యాలని భావించానని, అందుకే శక్తి వంచన లేకుండా కష్టపడ్డానని ఆయన తెలిపారు. విదేశాలకు వెళ్లి కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేశానని అన్నారు. రాజధాని నిర్మాణంపై సింగపూర్ తో ఒప్పందం చేసుకున్నానని ఆయన చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన బృహత్ ప్రణాళిక ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సింగపూర్ కు సంబంధించిన పలు పరిశ్రమలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News