: నా తొలి తమిళ, తెలుగు సినిమాలో రజనీతో నటించడం గర్వంగా ఉంది: సోనాక్షి సిన్హా


తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని సోనాక్షిసిన్హా తెలిపింది. హైదరాబాదులోని నొవాటెల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తన తొలి తమిళ, తెలుగు సినిమాలో రజనీకాంత్ గారితో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. సినిమా షూటింగ్ మొత్తం కుటుంబ వాతావరణంలో జరిగిందని అన్నారు. రజనీ సార్ గురించి ఏం చెప్పినా తక్కువేనని పేర్కొన్న ఆమె, ఆయన సాధించిన దాంట్లో ఏ కాస్త సాధించినా తన జీవితం ధన్యమైనట్టేనని తెలిపింది. ఆయనంత గొప్ప మనిషిని చూడలేమని, అంత సాధించినా ఏమీ సాధించనట్టు ఉండగలగడం ఆయనలోని ఉన్నత లక్షణమని ఆమె వివరించింది. అనుష్క స్వీటీ అన్న పేరుకు తగ్గట్టు ఎంతో స్వీట్ గా ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News