: కడప జిల్లాలో వింత ఆచారం
పెళ్లిళ్ల సీజన్ రావడంతో పలు సంప్రదాయాలు, ఆచారాలు వెలుగులోకి వస్తున్నాయి. భిన్న సంస్కృతుల సమ్మేళనమైన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వింత ఆచారం రాజ్యమేలుతోంది. పెందిళ్లమర్రి మండలం మాచనూరులో ఓ కుటుంబంలో యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఆచారం పేరిట పెండ్లి కుమారుడిని పెళ్లి కూతురు గెటప్ లో తయారు చేశారు. అనంతరం పెండ్లి కుమారుడు ఊరేగింపుగా వధువుకు సారె తీసుకుని వెళ్లి అందజేశాడు. మాచనూరులో ప్రతి ఇంట్లోని పెద్ద కుమారుడు ఇలా సంప్రదాయాన్ని పాటించాల్సిందేనని, దీని వల్ల మహిళలు తమ లాంటి వారేనని, వారిని గౌరవంగా చూడాల్సిన బాధ్యత వరుడిపై ఉందని తెలియజేయడమే సంప్రదాయం ఉద్దేశమని పెళ్లి పెద్దలు తెలిపారు. సంప్రదాయాన్ని పాటించడమే తన బాధ్యతని పెళ్లి కుమారుడు తెలిపాడు. దీంతో ఊర్లో సందడి వాతావరణం ఏర్పడింది. చిన్నాపెద్దా అందరూ వధువు రూపంలో ఉన్న పెళ్లి కుమారుడిని ఊరేగింపుగా వధువు ఇంటికి తీసుకెళ్లారు.