: మోదీ ప్రధాని అయ్యాకే రాజకీయాలపై ఆసక్తి కలిగింది: సోనాక్షీ సిన్హా


రాజకీయాలపై తన ఆలోచనలను వెల్లడించింది బాలీవుడ్ అందాల భామ సోనాక్షీ సిన్హా. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని, అయితే, తండ్రి శతృఘ్న సిన్హా (పాట్నా సాహెబ్ నియోజకవర్గ ఎంపీ)తో అప్పుడప్పుడు చర్చిస్తుంటానని తెలిపింది. రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. సినిమాలపైనే తన దృష్టి అని చెప్పింది. కేంద్రంలో నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాతే తనకు రాజకీయాలపై ఆసక్తి ఏర్పడిందని ఈ 'యాక్షన్ జాక్సన్' సుందరి అంటోంది.

  • Loading...

More Telugu News