: ఓటెయ్యండి... రుణం తీర్చుకుంటా: మోదీ
కాశ్మీర్ ప్రజలు బీజేపీకి ఓటేసి విజయం అందిస్తే, అభివృద్ధి చేసి చూపి రుణం తీర్చుకుంటానని ప్రధాని మోదీ అన్నారు. నేటి మధ్యాహ్నం శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అందరం కలసికట్టుగా వికాసం సాధించాలని, అదే తన నినాదమని ఆయన వివరించారు. కాశ్మీర్‌పై వాజ్‌పేయి కన్న కలలను నిజం చేయాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల కష్టాలను తీర్చడం తన బాధ్యతని పేర్కొన్న మోదీ, ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రాణత్యాగం చేసిన జవాన్లు, పోలీసుల కుటుంబాలకు ఏం చేసినా తక్కువేనని మోదీ అన్నారు.