: స్మార్ట్ ఫోన్ల వాడకంపై గూగుల్ స్పెషల్ అప్లికేషన్
స్మార్ట్ ఫోన్లలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం, వివిధ రకాల ఫీచర్లను వాడుకోవడం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు? అనే విషయాలను తెలియజేయడానికి గూగుల్ 'డివైజ్ అసిస్ట్' పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. మొదటిసారి స్మార్ట్ ఫోన్ వినియోగించేవారికి ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఇది గూగుల్ నెక్సస్, గూగుల్ ప్లే ఎడిషన్ డివైజెస్, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ వెర్షన్లలో ఈ యాప్ పని చేస్తుందని, గూగుల్ ప్లే నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.