: ఏపీలో 'ఎయిమ్స్' నిర్మాణం జనవరిలో ప్రారంభిస్తాం: మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ లో 'ఎయిమ్స్' నిర్మాణాన్ని జనవరిలో ప్రారంభించనున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు మంగళగిరిలో 'ఎయిమ్స్' కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. దానికోసం 190 ఎకరాలు కేటాయించామని చెప్పారు. మరో ఐదు ఎకరాల అటవీభూమిని కూడా కేటాయిస్తామన్నారు. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లిన కామినేని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి 'ఎయిమ్స్' అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బృందం పర్యవేక్షణ తరువాత 'ఎయిమ్స్'కు నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారన్నారు.