: కైకలూరు సమీపంలో 700 తాబేళ్ళను స్వాధీనం చేసుకున్న అధికారులు


కృష్ణా జిల్లా వెంకటాపురం గ్రామంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 700 తాబేళ్ళను కైకలూరు అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గోనె సంచుల్లో ఉంచి, ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నించారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏ. సునీల్ కుమార్ తెలిపారు. కలిదిండి మండల పరిధిలోని వెంకటాపురంలో ఓ ప్రైవేటు ప్లాట్ లో ఈ సంచులున్నాయని తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News