: మామా అల్లుళ్ళను పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్న టీడీపీ నేత
తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగారు. త్వరలోనే తాను పార్టీ మారడం ఖాయమని వారు ప్రచారం చేస్తుండడం పట్ల ఈ టీడీపీ శాసనసభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీఆర్ఎస్ లోకి వెళ్ళబోనని, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్ రావులు టీడీపీలోకి వస్తే తప్పక చేర్చుకుంటామని మహేందర్ రెడ్డి వ్యంగ్యోక్తి విసిరారు. గత రెండుమూడు రోజుల నుంచి 'ఆపరేషన్ ఆకర్ష' పేరిట కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్ నేతలకు వల విసురుతున్న సంగతి తెలిసిందే!