: నకిలీ పాస్‌పోర్టులతో విమానం ఎక్కుతున్న నలుగురి అరెస్ట్
నకిలీ పాస్‌పోర్టులతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న నలుగురు వ్యక్తులు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వీరంతా మస్కట్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని, అనుమానం వచ్చి పాస్‌పోర్టులు చెక్ చేయగా, అవి నకిలీవని తేలిందని అధికారులు వివరించారు. అనంతరం వీరిని శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.