: చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సెటైర్లు వేశారు. రాజ్యాంగం అనుమతిస్తే సింగపూర్ వాసులను కూడా బాబు తన మంత్రివర్గంలో చేర్చుకుంటారేమోనని వ్యాఖ్యానించారు. ఇంతవరకు ఒక్క పైసా రుణమాఫీ చేయకుండానే సన్మానాలు చేయించుకుంటున్నాడని విమర్శించారు. రుణమాఫీ విషయంలో బాబు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ అనుసరించి రుణమాఫీ చేయాల్సిందేనన్నారు. అటు, ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి సాధించడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని రామకృష్ణ విమర్శించారు.