: నెలాఖరుకు ఆహార భద్రతా కార్డుల పంపిణీ: కేటీఆర్


తెలంగాణ ప్రభుత్వంపై ఎంత భారం పడ్డా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని, నెలాఖరులోగా ఆహార భద్రతా కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు ఆయన చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టే సమస్యే లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం బియ్యం కోటాను పెంచిందని కేటీఆర్ గుర్తు చేశారు. శంకర్‌పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని, విద్యుత్ కేంద్రం విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News