: సాకర్ మ్యాచ్ లో మేక హల్ చల్
క్రీట్ దీవిలో ఓ సాకర్ మ్యాచ్ కు పిలవని పేరంటంలా వచ్చిందో మేక. స్థానిక జట్లు మ్యాచ్ ఆడుతుండగా ఆ మేక మైదానంలోకి ప్రవేశించింది. నేరుగా గోల్ పోస్ట్ వద్దకు వెళ్లింది. ఆటగాళ్లు ఎంత అదిలించినా వెళ్లకుండా మొండికేసింది. గోల్ కీపర్ తో 'నువ్వా నేనా' అన్నట్టు వ్యవహరించింది. మ్యాచ్ రిఫరీ దాన్ని గోల్ పోస్టు వెనక్కి తీసుకెళ్లినా, కాసేపటికే మళ్లీ మైదానంలో ప్రత్యక్షమైంది. ఇలా పలుసార్లు ఇబ్బందులు పెట్టిన పిమ్మట, ఓ ప్రేక్షకుడు వచ్చి కొమ్ములు పట్టుకుని దాన్ని బయటికి లాక్కెళ్లడంతో ఆటకు అడ్డంకి తొలగిపోయింది.