: పోలీసు శాఖ ఖాళీలు త్వరలో భర్తీ: తెలంగాణ హోం మంత్రి


తెలంగాణ పోలీసు శాఖలోని ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. నేటి ఉదయం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పోలీసు శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఎదుగుతున్న యాదగిరిగుట్ట భద్రత కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించనున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News