: రుణమాఫీపై పార్టీలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి: అచ్చెన్నాయుడు


రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తున్నామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే మాఫీ గురించి రైతులు ప్రశ్నించలేదన్నారు. ఏపీ సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో అమలు చేసిందన్న మంత్రి, రుణమాఫీపై కొన్ని పార్టీలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్నారు. అసలు రైతుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని ఆరోపించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల దోపిడీపై ధర్నా చేయాలని డిమాండ్ చేసిన మంత్రి, అసలు ఉనికే లేని పార్టీకి ఏపీలో రఘువీరారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News