: కార్ల చోరీలో మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం!
అతడో మాజీ ఎమ్మెల్యే కుమారుడు. పేరు సుమన్. రాజకీయవేత్త అయిన తన తండ్రి పరువును బజారుకీడ్చాడు. ఎమ్మెల్యే కొడుకుగా చెప్పుకుంటూనే కార్ల చోరీకి పాల్పడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.56 లక్షల విలువ చేసే కార్లను తస్కరించాడు. నిన్నటిదాకా తన చోర కళతో పలువురిని ఇబ్బందులపాల్జేసిన అతడు చివరకు పోలీసులకు చిక్కాడు. మాజీ ఎమ్మెల్యే సుపుత్రుడి చేతివాటానికి నివ్వెరపోయిన జూబ్లీహిల్స్ పోలీసులు అతడి నుంచి రూ.56 లక్షల విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకుని అతగాడిని స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే సుపుత్రుడు చేతివాటం ప్రదర్శించిన వైనాన్ని మరికొద్దిసేపట్లో పోలీసులు మీడియాకు వివరించనున్నారు.