: ఆసీస్ జట్టులో 13వ ఆటగాడిగా ఫిలిప్ హ్యూస్


రేపట్నుంచి ఇండియాతో ప్రారంభంకానున్న తొలిటెస్టులో దివంగత ఫిలిప్ హ్యూస్ చోటు దక్కించుకున్నాడు. అతడిని 13వ ఆటగాడిగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన ఓ డొమెస్టిక్ మ్యాచ్ లో బౌన్సర్ దెబ్బకు నేలకొరిగిన హ్యూస్... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. హ్యూస్ కు సంతాపంగా అతని టెస్ట్ క్యాప్ నెంబర్ 408ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ టీషర్ట్ పై ధరించనున్నారు. అంతేకాకుండా, సంతాప సూచకంగా నల్లటి ఆర్మ్ బ్యాండ్ ను కూడా ధరించబోతున్నారు.

  • Loading...

More Telugu News