: ఎన్నికల్లో వ్యయ పరిమితిపై ఈసీకి హైకోర్టు నోటీసులు
ఎన్నికల్లో వ్యయ పరిమితిపై ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపన్ను చీఫ్ కమిషనర్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్రానికి కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఓ పత్రిక ఎడిటర్ రాసిన లేఖను పిటిషన్ గా పరిగణించిన కోర్టు పైవిధంగా స్పందించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.