: ఇస్లామిక్ స్టేట్ లో ఆత్మాహుతి దళ సభ్యుడిని... ఎన్ఐఏ విచారణలో మజీద్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో కలవడానికి వెళ్లి అతికష్టం మీద తిరిగొచ్చిన ముంబై యువకుడు మజీద్ ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. తనను ఆత్మాహుతి దళంలో నియమించి, సిరియా సైన్యంపై దాడిచేసేందుకు శిక్షణ ఇచ్చారని మజీద్ తెలిపాడు. సిరియా సైన్యంపై దాడికి ప్రయత్నించి తాను విఫలమైనట్టు తెలిపాడు. అంతకుముందు తనతో టాయిలెట్ లు కడిగించారని మజీద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, మజీద్ కస్టడీ నేటితో ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.