: నేదునూరికి సంతాపం ప్రకటించిన చంద్రబాబు
సంగీత కళానిధిగా వినుతికెక్కిన నేదునూరి కృష్ణమూర్తి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. నేదునూరి మృతికి ఏపీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు కూడా సంతాపం ప్రకటించారు. తిరుమల, కంచి కామకోఠి ఆస్థాన విద్వాంసుడిగా నేదునూరి పనిచేశారు.