: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ నివాసం ఎదుట ఆప్ ఆందోళన


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం దేశ రాజధానిలో జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదంటూ వీరు నినాదాలు చేశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుమ్మెత్తి పోశారు. వెంటనే మహిళల రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు వంద మంది ఆప్ మద్దతుదారులను అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి 25 ఏళ్ల యువతిని ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడు. నిందితుడిని మధురలో పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News