: తమ్మినేని వీరభద్రం భార్యపై అంబర్ పేట రౌడీ షీటర్ దాడి, కేసు నమోదు


సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సతీమణి సహా పలువురు మహిళలపై అంబర్ పేట రౌడీ షీటర్ రబ్బానీ, అతడి అనుచరులు దాడికి దిగారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితులు సోమవారం ఉదయం అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదు నేపథ్యంలో రబ్బానీ, అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబర్ పేట పరిధిలోని డీడీ కాలనీలో వీరభద్రం కుటుంబం నివాసముంటోంది. వీరు నివాసం ఉన్న అపార్ట్ మెంట్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రబ్బానీని ఆదివారం రాత్రి వీరభద్రం సతీమణి సహా అక్కడి మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రబ్బానీ తన అనుచరులతో కలిసి వారిపై దాడికి దిగాడు. రబ్బానీపై ఇప్పటికే పలు హత్యానేరాలతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది.

  • Loading...

More Telugu News