: నరేంద్ర మోదీ... టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ టైమ్స్ పర్సన్ ఆప్ ది ఇయర్ గా ఎంపిక కానున్నారు. మరికొద్ది గంటల్లో ఈ మేరకు టైమ్ మేగజీన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ముగిసిన ఓటింగ్ లో మోదీ ఈ అవార్డు రేసులో ముందంజలో ఉన్నారు. రేసులో తన వెనుక ఉన్న వారందరికంటే చాలా భారీ సంఖ్యలో ఓట్లను చేజిక్కించుకున్న ఆయన వారికి అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఆదివారం ముగిసిన ఓటింగ్ శాతాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ శనివారం నాటికే మోదీ మొత్తం ఓట్లలో 16.2 శాతాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఈ అవార్డు కోసం రేసులో మోదీ తర్వాత ఉన్న ఫెర్గ్యూసన్ నిరసనకారులకు 9.2 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో టైమ్స్ పర్సన్ ఆప్ ది ఇయర్ గా మోదీ ఎంపిక కావడం లాంఛనమేనని 'టైమ్' మేగజీన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 1927 నుంచి టైమ్ మేగజీన్ నిర్వహిస్తున్న ఈ పోల్ లో ఈ దఫా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి పది మంది జాబితాలోనూ చోటు సాధించే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం 2.2 శాతం ఓట్లతో ఆయన ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నారు.