: మోదీ ‘టీమిండియా’ ప్రతిపాదనకు చంద్రబాబు, కేసీఆర్ సంపూర్ణ మద్దతు!


నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు... తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ముఖ్యమంత్రులు. ఒకప్పుడు టీడీపీలో కొనసాగిన వీరిద్దరూ అనంతర కాలంలో వైరివర్గాలుగా మారిపోయారు. రాష్ట్ర విభజన జరగడం, కొత్తగా ఆవిర్భవించిన రెండు రాష్ట్రాలకు సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బద్ధ శత్రువులుగానూ మారారు. అయితే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల సమావేశంలో మాత్రం ఒకే అభిప్రాయంతో ముందుకు సాగారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ కొత్తగా రూపుదిద్దుకోనున్న సంస్థ విషయంలో మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీరిద్దరూ, కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. ప్రస్తుతానికి టీమిండియాగా పిలుచుకుంటున్న ఈ సంస్థకు ప్రత్యేక సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించగా, 2050ని దృష్టిలో పెట్టుకుని సమగ్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళదామంటూ చంద్రబాబు ప్రధానికి సూచించారు. అంతేకాదు, మోదీ తన అధికార నివాసంలోని పచ్చిక బయలులో సీఎంలకు ఇచ్చిన తేనీటి విందులో ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, చంద్రబాబు భోజనాల సమయంలోనూ నవ్వుతూ, తుళ్లూతూ గడిపారట. ఆ సమయంలో భోజనం గురించే మాట్లాడుకున్నామంటూ వారిద్దరూ మీడియాతో చెప్పిన సంగతులపై జాతీయ మీడియా ఆసక్తికర కథనాలను వెలువరించాయి.

  • Loading...

More Telugu News