: వెలువర్తిలో దారుణం... ముగ్గురు చిన్నారులకు కరెంట్ షాకిచ్చి చంపిన తండ్రి


నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తిలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుర్మార్గపు తండ్రి కన్నబిడ్డలకు కరెంట్ షాకిచ్చి, వారిని దారుణంగా హతమార్చాడు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు ఆ దుర్మార్గుడికి తొలి భార్య సంతానమట. ఆస్తి విషయంలో మొదటి భార్యతో ఏర్పడ్డ తగాదాల నేపథ్యంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. తండ్రి పెట్టిన కరెంట్ షాక్ కు గురై నిరోష(8), రక్షిత (7), యశ్వంత్ (2)లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పిల్లలను హత్య చేసిన తండ్రి రమేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News