: నేడు పాలమూరులో షర్మిల పరామర్శ యాత్ర
వైకాపా తెలంగాణ శాఖ గౌరవాధ్యక్షురాలు షర్మిల నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్రను ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో యాత్ర చేపట్టనున్న షర్మిల, 19 కుటుంబాలను పరామర్శిస్తారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిలకు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి వద్ద పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆమె తన యాత్రను ప్రారంభిస్తారు.