: రేపు తిరుమల విచ్చేస్తున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స రేపు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. సకుటుంబ సమేతంగా రాజపక్ష శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. అనంతరం రాత్రికి కొలంబో బయలుదేరుతారు. ఇప్పటికే తిరుమల చేరుకున్న శ్రీలంక అధికార బృందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. భద్రతాధికారుల బృందం తిరుమలలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. తిరుమల విజిలెన్స్ ఏవీఎస్ఓ, ఇతర అధికారులతో భేటీ అయి పర్యటనపై చర్చించింది. రాజపక్స గతంలో పలుసార్లు వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే.