: హైదరాబాదులో సూపర్ స్టార్ రజనీకాంత్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు హైటెక్ సిటీ సమీపంలో ఉన్న నొవాటెల్ హోటల్ లో జరిగే 'లింగ' ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ అందాల సుందరి సోనాక్షి సిన్హా, అనుష్కలు కథానాయికలుగా నటించారు.