: రాజధాని మాస్టర్ ప్లాన్ పై సింగపూర్ తో ఏపీ సర్కారు ఒప్పందం నేడే!
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రణాళిక, సాంకేతిక సహకారం తదితరాలపై సింగపూర్ ప్రభుత్వం, ఏపీ సర్కారుల మధ్య నేడు ఒప్పందం కుదరనుంది. ఇందుకోసం సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధి బృందం నేడు హైదరాబాద్ వస్తోంది. నేటి సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో సింగపూర్ ప్రతినిధి బృందం భేటీ కానుంది. ఈ సందర్భంగా సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజెస్, ఏపీ మౌలిక సదుపాయాల సంస్థలు చంద్రబాబు, ఈశ్వరన్ ల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై నేడు ఒప్పందం కుదుర్చుకోనున్న సింగపూర్ ప్రతినిధి బృందం, మంగళవారం రాజధాని సలహా కమిటీతో భేటీ కానుంది. అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో ఆ బృందం పర్యటించనుంది.