: రాజధాని రైతులతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులతో నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. రాజధాని కోసం భూములను అప్పగించే రైతులకు ప్రభుత్వం ఏం చేయనుందన్న విషయంపై చంద్రబాబు ఈ సందర్భంగా విస్పష్ట ప్రకటన చేయనున్నారు. రాజధాని భూముల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించనున్న తీరుపైనా చంద్రబాబు విధాన ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే భూముల యజమానులకు ఇవ్వనున్న ధర, ఇతర ప్రయోజనాలపై ఓ అవగాహనకు వచ్చినా, కౌలు రైతులు, రైతు కూలీలకు ఏం చేయాలన్న దానిపై విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఇటీవలే రైతు రుణమాఫీ ప్రకటించి రైతుల్లో మంచి మైలేజీ సాధించిన చంద్రబాబు, నేటి భేటీలో రాజధాని ప్రాంత రైతులను కూడా తనకు అనుకూలంగా మలచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News