: ప్రధాని ప్రతిపాదన టీమ్ ఇండియా స్ఫూర్తిని నింపేలా ఉంది: కేసీఆర్


ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడారు. ప్రణాళిక సంఘం స్థానంలో నూతన వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థించారు. కొత్త ప్రతిపాదన టీమ్ ఇండియా స్ఫూర్తిని నింపేలా ఉందన్నారు. విస్తృత ఫలితాలే లక్ష్యంగా శాఖలవారీగా కేటాయింపులు జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పంచవర్ష ప్రణాళిక బదులు 10-15 ఏళ్లకు ప్రణాళికలు ఉండాలని అన్నారు. ఇక, మావోయిస్టులు, గంగా నది ప్రక్షాళన వంటి అంశాల్లో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News