: భూసమీకరణపై సోమవారం ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత భూసమీకరణపై సోమవారం ప్రకటన చేయనున్నారు. ఢిల్లీలో సీఎంలతో ప్రధాని సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాజధాని విషయం ప్రధాని మోదీతో ప్రస్తావించానని తెలిపారు. భూసమీకరణ అంశంపై రేపు ప్రకటన చేస్తానని చెప్పారు. శనివారం నాడు ఈ ప్రకటన చేయాల్సి ఉన్నా, నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ మృతి చెందడంతో వాయిదా వేసుకున్నామని వివరించారు.