: జానకీరామ్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న యార్లగడ్డ


కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి జానకీరామ్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జానకీరామ్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మాట్లాడారు. అప్పట్లో, ఆంధ్రా యూనివర్శిటీలో విద్యాభ్యాసం నిమిత్తం జానకీరామ్ ఏడాది పాటు తమ ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని, విశాఖలో ఉన్నన్నాళ్లు తాను ఎన్టీఆర్ మనవడినన్న సంగతి ఎవరికీ తెలియనివ్వలేదని చెప్పారు. అతని మరణం నందమూరి హరికృష్ణకు తీరనిలోటు అని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News