: సీఎంలతో ముగిసిన ప్రధాని సమావేశం


ముఖ్యమంత్రులతో తన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశం ముగిసింది. ప్రణాళిక సంఘం స్థానంలో ప్రతిపాదిత కొత్త వ్యవస్థ ఏర్పాటుపై ఈ భేటీలో చర్చించారు. కేంద్రం ప్రతిపాదనలను మోదీ ముఖ్యమంత్రులకు వివరించారు. వీటిపై సీఎంల అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నూతన ప్రణాళికలు ఉండాలని ప్రధాని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశం అభివృద్ధి చెందదని అన్నారు. ప్రణాళికా విధానంలో క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రణాళికా సంఘం స్థానంలో సుస్థిరమైన, బలమైన వ్యవస్థ ఏర్పాటు కావాలని అభిలషించారు. దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్థ ఉండాలని అన్నారు.

  • Loading...

More Telugu News