: తొలి దశ రుణమాఫీ అర్హుల జాబితా విడుదల... కొన్నిచోట్ల తెరుచుకోని వెబ్ సైట్
ఏపీలో తొలి దశ రుణమాఫీ అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జాబితాను సర్కారు వెబ్ సైట్లో పెట్టారు. http://apscbsportal.ap.gov.in/loanstatus లో అర్హుల జాబితాను చూసుకోవచ్చు. అయితే, సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల ఈ వెబ్ సైట్ తెరుచుకోవడం లేదని తెలుస్తోంది.