: సిబ్బందితో పాటు ప్రయాణికులకు అస్వస్థత... విమానం అత్యవసర ల్యాండింగ్
యూఎస్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం రోమ్ లో అత్యవసరంగా ల్యాండైంది. ఇద్దరు ప్రయాణికులు, 11 మంది సిబ్బంది అస్వస్థతకు గురవడంతో ఈ విమానాన్ని ఇటలీలో దింపాల్సి వచ్చింది. ఈ విమానం ఇజ్రాయెల్ లోని టెల్ అవివ్ నుంచి అమెరికాలోని ఫిలడెల్ఫియా వెళుతోంది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థత కారణంగా తీవ్ర ఇబ్బందిపడ్డారు. కళ్లు మండడంతోపాటు వాంతులు కూడా అయ్యాయి. దీంతో, విమానాన్ని రోమ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడ, వారిని విమానాశ్రయ వైద్యులు పరీక్ష చేసిన అనంతరం రోమ్ లోని గ్రాస్సి డి ఓస్టియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఎయిర్ బస్ ఏ330 విమానం వెంటిలేషన్ వ్యవస్థలోని లోపమే సమస్యకు కారణమని తెలుస్తోంది.