: రంజీల్లో ప్రతాపం చూపిన సీనియర్లు!
వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో స్థానం దక్కించుకోలేని సీనియర్ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ రంజీల్లో రెచ్చిపోయారు. సౌరాష్ట్రతో మ్యాచ్ లో గంభీర్ అజేయ సెంచరీ సాధించగా, హర్యానాతో పోరులో యువీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌరాష్ట్రపై ఓపెనర్ గా బరిలో దిగిన గంభీర్ 200 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. ప్రస్తుతం, గంభీర్ సెంచరీ సాయంతో ఢిల్లీ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 189 పరుగులతో ఆడుతోంది. ఇక, పంజాబ్-హర్యానా మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ప్రధానాకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం ఈ లెఫ్ట్ హ్యాండర్ 52 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పంజాబ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 222 పరుగులతో ఆడుతోంది.