: కన్నీరు ఆపుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ విఫలయత్నం... అమాయకంగా చూసిన జానకీరామ్ తనయుడు


సోదరుడు జానకీరామ్ మరణంతో జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయాడు. అంత్యక్రియల సందర్భంగా, ఉబికివస్తున్న కన్నీటిని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. జానకీరామ్ చితికి తనయుడు తారక రామారావు నిప్పంటించే క్రమంలో, ఆ చిన్నారికి జూనియర్ ఎన్టీఆరే సాయపడ్డాడు. చితి అంటుకోగానే ఆ బాలుడిని పక్కకు తీసుకొచ్చాడు. అనంతరం అక్కడ ఉన్న కుర్చీలలో అందరూ కూర్చున్నా, మౌనమే రాజ్యమేలింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తలవంచుకుని, పెదిమలు బిగపట్టి, విఫలయత్నం చేశాడు. అయినా, కళ్లు ధారాపాతంగా వర్షించాయి. అటు, కల్యాణ్ రామ్, తారకరత్న దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోని రీతిలో కనిపించారు. జానకీరామ్ తనయుడు తారక రామారావు వీరందరినీ అమాయకంగా చూస్తుండడం అక్కడి వారిని మరింతగా కదిలించివేసింది.

  • Loading...

More Telugu News